మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు.. పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది. ప్రభుత్వం, విశాఖ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పాకిస్థాన్…
వాటికన్ సిటీలో పర్యటనలో భారత రాష్ట్రపతి. నేడు పోప్ ఫ్రావిన్స్ అంత్యక్రియల్లో భారత్ తరుఫున పాల్గొననున్న ద్రౌపది ముర్ము. నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఎచ్చర్లలో మత్స్యకార భృతి పంపిణీ చేయనున్న చంద్రబాబు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం. 1,29,178 మత్య్సకార కుటుంబాలకు లబ్ధి. నేడు కాకినాడలో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పర్యటన. యాంకరేజ్ పోర్ట్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పరిశీలించనున్న మంత్రి. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి జనార్థన్‌రెడ్డి.…
బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా.. బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది. మరో ఆరుగురు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. 10 మంది గొల్లపూడి, అశోక్ నగర్,…
ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్‌కు చేరువైన ఆర్సీబీ! ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు రుచిని చవిచూసింది. 18వ సీజన్లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేయలిగింది. ఐపీఎల్ 2025లో ఆరో విజయంను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మరో రెండు విజయాలు సాధిస్తే…
బాలుడి కిడ్నాప్.. గంటలో చేధించిన పోలీసులు పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, ఈ సంఘటనలో పోలీసులు వేగంగా స్పందించడంతో గంటలోనే బాలుడిని రక్షించి, కిడ్నాపర్లను పట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడిని అతని బాబాయి సాదిక్ దగ్గరకు తీసుకెళ్లారు. సాదిక్ బాలుడిని ఓ వైన్ షాప్ కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన సాదిక్ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కనే పడిపోయాడు. ఈ…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.
పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్‌కు కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఇరు వైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఉధంపూర్‌లోని డూడులో జరుగుతోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో…
అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం.
కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యటకులకు తగిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ పర్యటక శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. READ MORE: Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు…