సైన్యం భారీ ఆపరేషన్.. మణిపూర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతం.. మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు…
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా…
నేటి నుంచి 4 రోజుల తెలంగాణలో వర్షాలు. పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో నేటి నుంచి మరో 25 చోట్ల స్లాట్ విధానం. భారీగా రిజిస్ట్రేషన్లు ఉన్న 3 చోట్ల అదనపు సిబ్బంది. స్లాట్ విధానంలో రోజుకు 45…
త్రిషకు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని.. ముద్దు గుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. చెన్నై అమ్మడు అయినప్పటికి తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం …
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన.. భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం…
ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన! పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి…
ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ పై మెరుపుదాడులు.. భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం…
బర్రెలక్క (కర్నె శిరీష) అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్షేషన్‌ను చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో దూకుడుగా వ్యవహరించి.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అయితే ఫలితాల్లో మాత్రం వెనకబడింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే…