చైనాలో భూకంపం.. తీవ్రత 4.5గా నమోదు
చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6:59 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.5గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
శ్రీవారి భక్తులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్.. లక్షా 25 వేలు వసూలు చేసి..!
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని బురిడీ కొట్టించే వారు రోజుకొకరు పెరిగిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుంచి అధికారులు కేటుగాళ్ల భరతం పడుతున్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు అనతి కాలంలోనే పలువురిని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు మాత్రం భక్తుల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. టెక్కీ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన బెంగళూరు టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌క చెందిన శుభాన్షు శుక్లా బెంళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉంటున్నాడు. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సమయంలో మే 9న హాస్టల్ బాల్కనీ నుంచి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడు. ఇలా మూడు సార్లు నినాదాలు చేశాడు. మే 9న అర్థరాత్రి 12:30 గంటల సమయంలో వైట్‌ఫీల్డ్‌లోని ప్రశాంత్ లేఅవుట్‌లో జరిగింది. అదే సమయంలో సమీపంలో ఉన్న నివాసి మొబైల్‌లో రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
తమది తుర్కియే సంస్థే కాదు.. సెలెబీ ప్రకటన
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి ఆయుధాలు సరఫరా చేసిన తుర్కియేపై భారతీయులు నిరసన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశానికి సంబంధించిన వస్తువులు, సేవలను, టూరిజాన్ని నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక భారతీయ విమానాశ్రయాల్లో సరకుల రవాణాతో పాటు వివిధ సేవలు అందిస్తున్న తుర్కియే కంపెనీ సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌కు అనుమతులను గురువారం కేంద్రం రద్దు చేసింది. పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవ్వడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ భారీ వర్ష సూచన
అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ వాయు చక్రవాత ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నేటి , రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షం కూడా సంభవించనుందని పేర్కొంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. జేమ్స్ కామీ ‘‘8647’’ అనే పదాలను పోస్టు చేశారు. అంటే దీని అర్థం అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా రహస్య కోడ్ ఇది. దీంతో కామీపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ వెల్లడించారు. ఈ విషయంపై జేమ్స్ కామీ స్పందించారు. తన పోస్ట్‌ను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఆ నెంబర్లు కొందరు హత్యలు చేసేందుకు ఉపయోగిస్తారన్న విషయం తెలియదన్నారు. అమెరికా అధ్యక్షుడ్ని చంపాలనే ఉద్దేశం తనకు లేదని.. హింస అంటేనే ఇష్టం ఉండదన్నారు. పోస్ట్‌ను అపార్థం చేసుకున్నందుకు డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ఇంకా అనిశ్చితమే.. తుది నిర్ణయం పెండింగ్‌లో
తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై స్పష్టత ఇంకా రాలేదు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడు సంవత్సరాల పాటు ఫీజులను నిర్ణయించేందుకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్లు & ఫీజులు నియంత్రణ కమిటీ) అనేక సార్లు సమావేశమైనా, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రైవేట్ కాలేజీలు ఆడిట్ నివేదికలను తమ అనుకూలంగా రూపొందించారని ఆరోపణల నేపథ్యంలో, విద్యాశాఖ , ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే ఫీజుల ఖరారుపై నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. మార్చి నెలలో నిర్వహించిన హియరింగ్‌లో కొన్ని కాలేజీలు మాత్రమే టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపాయి. మిగిలినవి విరుద్ధంగా స్పందించాయి.
మద్యం కేసులో రెండో రోజు సిట్ కస్టడీకి శ్రీధర్ రెడ్డి!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండవ రోజు కస్టడీకి తీసుకుంది. శ్రీధర్ రెడ్డిని ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి ఆయన్ను అధికారులు తరలించారు. సిట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. నిన్న ఏడు గంటల పాటు శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. కీలక ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. లిక్కర్ కేసులో ఇప్పటికే ముగ్గురిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మద్యం స్కాం లో కీలకంగా పనిచేసిన శ్రీధర్ రెడ్టి ద్వారా మరింత సమాచారం రాబట్టాలని భావించిన సిట్ అధికారులు.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కస్టడీ అనుమతి పొందారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మే 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలు కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో వంశీపై పిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికను ఆయన పోలీసులకు అందించారు. 2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీ ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ సహా 8 మందిపై కేసు నమోదైంది.
అవినీతి చేసేవాళ్లే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
బీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. సిఎస్‌ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, తాను ఎప్పుడూ మంత్రులు కమిషన్ తీసుకుంటారని మాత్రమే వ్యాఖ్యానించానని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కాదని స్పష్టంచేశారు. అయితే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నేతలు తప్పుడు వీడియో ఎడిటింగ్‌తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటల్ని అసంపూర్ణంగా ప్రచారం చేసి బద్నాముచేయాలని ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘నేను ఎవరు అన్నా వాళ్లను తానే అనుకున్నారు… కాంగ్రెస్ మంత్రులు అని నేనెప్పుడూ అనలేదు,’’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.