తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ.
విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన. మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటన.
నేడు, రేపు కచ్‌లో రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన. భుజ్ వైమానిక దళ స్టేషన్‌కి వెళ్లనున్న రాజ్‌నాథ్. నలియా వైమానిక స్థావరంలో సమావేశానికి హాజరు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను సమీక్షించనున్న రాజ్‌నాథ్.
అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు. తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్.
నేడు చేవెళ్ల పార్లమెంట్ పరిధి నేతలతో రేవంత్ భేటీ. హాజరుకానున్న ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు.
ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ. ఇందిరాగాంధీ స్టేడియంనుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురంధేశ్వరి.
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి జూన్2 వరకు బదిలీలకు అనుమతి. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీకి ఆదేశం. ఐదేళ్లలోపు ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపంపై బదిలీలు. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు.
పీఎస్‌ఆర్ బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ. గ్రూప్-1 అక్రమాల కేసులో రిమాండ్‌లో ఉన్న పీఎస్‌ఆర్.
నేడు పిల్లలమర్రి, ఏఐజీకి ప్రపంచ సుందరీమణులు. హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్‌ను సందర్శించనున్న ప్రపంచ సుందరీమణులు.
మరోసారి సిట్ విచారణకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్. నిన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ను విచారించిన సిట్. లిక్కర్ కేసులో 13 గంటల పాటు కొనసాగిన విచారణ. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ ఫోన్లు పరిశీలించిన సిట్. విడివిడిగా, కలిపి విచారణ చేస్తూ ప్రశ్నలు. ఈ రోజు మళ్లీ విచారణకు రావాలని సిట్ అధికారుల ఆదేశం.