AP Weather: ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Also: Lavu Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్‌లో వివరిస్తాం..
సముద్రం అలజడిగా మారడంతో మత్స్య కారుల వేటపై నిషేధం కొనసాగుతోంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. చింతూరులో 5 సెం.మీ, అనకాపల్లిలో 3 సెంటిమీటర్లు, విశాఖలోని ఎయిర్ పోర్టు వద్ద 2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.