Lavu Sri Krishna Devarayalu: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగిందని.. ఏ విధంగా బడ్జెట్ సమావేశాల్లో ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చ జరిగిందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ వైపు నుంచి అన్ని సలహాలు ఇచ్చామని.. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. రాష్ట్రం నుంచి 21 ఎన్డీఏ ఎంపీలు ఉంటే అందులో 16 మంది టీడీపీ ఎంపీలు ఉన్నారని చెప్పారు. ఎంపీలు నియోజకవర్గం సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై అసెంబ్లీలో వైట్ పేపర్ విడుదల చేస్తున్నారని.. దాన్ని పార్లమెంట్‌కు కూడా వివరిస్తామన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్‌లో వివరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అడుగుతామనేది పార్లమెంట్ వేదికగా ప్రజలకు తెలుస్తుందన్నారు. అమరావతి,పోలవరం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఎంపీ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు చెప్పారని.. అమరావతి అభివృద్ధి, రోడ్ల నిర్మాణం ఇతర అంశాలపై పార్లమెంటులో చర్చిస్తామన్నారు.
Read Also: Anagani Satya Prasad: త్వరలోనే గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్..
పోలవరం, అమరావతిపై వైట్ పేపర్‌ను పార్లమెంట్‌లో వివరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్‌లో మాట్లాడుతామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడుతామన్నారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. వైసీపీ అమరావతి, పోలవరం అంశాలపై మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఐదేళ్ల నుంచి చేసిన తప్పులు బయటికి వస్తాయని ఢిల్లీలో ఆందోళన చేయాలని వైసీపీ చూస్తుందన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీ వస్తున్నారని.. లా అండ్ ఆర్డర్ ఇష్యు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి కానీ ఢిల్లీ వస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో మా ఫోకస్ ఏపీ ప్రయోజనాలు, ఏపీ ప్రజలు మాత్రమేనని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిపై ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిశారని చెప్పారు. ఏపీ ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో ఉందో దేశ ప్రజలకు కూడా తెలుస్తుందన్నారు. దేశం మొత్తం అభివృద్ధి చెందింది కానీ ఏపీ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం చెప్పారని ఎంపీ స్పష్టం చేశారు.