తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీలో అక్బుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. డిమానిటైజేశన్ విషయంలో నేనే వ్యతిరేకించానని, అప్పుడు కేసీఆర్.. మోడీ గురించి సభలో కనీసం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. అద్భుతమైన నిర్ణయం అని చెప్పుకొచ్చారని, జానారెడ్డి కూడా నోట్ల రద్దును వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారంటీ లలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం..అభినందనలు తెలిపారు. రేషన్ కార్డు నీ అన్ని పథకాలకు ముడి పెడుతున్నారని, చాలామందికి రేషన్ కార్డు లు లేవని,…
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు పెంచారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీటీయం పంచాయతీ మిట్టపల్లిలో వైసీపీ నేత, సీటీయం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త అక్కులప్ప ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు.
విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మూసారాంబాగ్‌లోని లైసెన్స్ లేని మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌పై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో మందుల నిల్వలను గుర్తించారు. ఈ దాడిలో అలవాటును పెంచే మందులు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, అబార్టిఫేషియెంట్ డ్రగ్స్, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ తదితర 19 రకాల రూ. 3.5 లక్షలు విలువ చేసే మందులను అధికారులు గుర్తించారు. మలక్‌పేట డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జి. అనిల్, సికింద్రాబాద్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్…
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై జేసీబీల లోడుతో ఆగివున్న ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ ప్రాంతంలో ఓ మహిళను ఆమె కొడుకు హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వినయ్ కుమార్ పసి (28) అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న తన తల్లి తుల్జా కుమారి పసి (55) తలపై ఇనుప రాడ్‌తో కొట్టినట్లు సమాచారం. తెల్లవారుజాము వరకు తుల్జాకుమారి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో మనవరాలు ఇంటికి వచ్చి పరిశీలించారు. ఆమె ఇంట్లోకి ప్రవేశించగా, లోపలి నుండి…
తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదువుతున్నారు.
ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామని.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లోని ప్రయాణికులపై వేడి వేడి 'టీ' పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై 'టీ' పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగి ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు