ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ పై శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. ఆసియా కప్ 2024 విజేతగా శ్రీలంక మహిళల జట్టు అవతరించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది శ్రీలంక ఉమెన్స్. లంక జట్టులో కెప్టెన్ చమరి ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ (69*) చెలరేగడంతో విజయం శ్రీలంకను వరించింది. కవిష దిల్హారీ (30) పరుగులతో రాణించింది. భారత్ బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చూపించలేకనే ఫైనల్ మ్యాచ్ను చేజార్చుకున్నారు. కేవలం దీప్తి శర్మ ఒక్కరే ఒక వికెట్ తీసింది. మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కాగా.. ఆసియా కప్లో అన్నీ మ్యాచ్లు నిలకడగా, అద్భుతంగా ఆడి టైటిల్ మ్యాచ్లో ఓడిపోయారు టీమిండియా.
Read Also: Manu Bhaker: మను భాకర్ కి రాష్ట్రపతి, ప్రధానితోసహా పలువురి ప్రశంసలు..
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్లో స్మృతి మంధాన (60) హాఫ్ సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. టీమిండియా బ్యాటింగ్లో.. ఓపెనర్లు షఫాలీ వర్మ (16), స్మృతి మంధాన నిలకడగా ఆడి జట్టుకు స్కోరును పెంచింది. ఆ తర్వాత.. రిచా ఘోష్ (30), జెమిమా రోడ్రిగ్స్ (29) రాణించారు. హర్మన్ ప్రీత్ కౌర్ (11), ఉమా శెట్టి (9), పూజా వస్త్రాకర్ (5) పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్లో కవిషా దిల్హారీ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత.. ఉదేశిక ప్రభోదిని, సచిని నిసన్సాల, చామిరి ఆటపట్టు తలో వికెట్ సంపాదించారు.
Read Also: Gottipati Ravikumar: రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి.. లైన్మెన్ను అభినందించిన మంత్రి