వలం కమీషన్ల కక్కుర్తి కోసం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కట్టారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 30 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లకు పెంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు అయ్యిందని.. కాళేశ్వరం మొత్తం పూర్తి కావడానికి రూ. లక్షా 47 వేల కోట్లు అవసరం అవుతాయని కాగ్ స్పష్టం చేసిందన్నారు.
మీరు అంగీకరించినా లేదా తిరస్కరించినా.. మన జీవితాలు మనం వాడే ఫోన్ల చుట్టే తిరుగుతాయి. దైనందిన జీవితంలో ఫోన్ లేకుండా ఏమీ చేయలేనీ పరిస్థితి నెలకొంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే ఉంటుంది. చాలా మంది వ్యక్తులకు ఫోన్ ఒక అవయవం వలే మారింది. ఫోన్ను నిరంతరం వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మీ వేళ్లు, మీ కళ్లకు హానీ కలిగించడమే కాకుండా.. ఫోన్ నుంచి వచ్చే ప్రకాశవంతమైన…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్ల నిధులు కేటాయించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ కేసీఆర్కు ఆ ఆలోచన లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్లు.. రేవంత్, భట్టిలకు అభినందనలు చెప్పాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నిన్న బడ్జెట్ మీద పదేళ్లు అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండాడుతాం అన్నారని.. అలాంటి కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టినా.. మీలాగా గ్యాస్...స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదంటూ పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 61 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు చేసి… తరువాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది ఓ భార్య. నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవకృష్ణా రెడ్డి… తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన తన ఓ యువతికి గంజాయి అలవాటు చేసింది. తరచూ తన ఇంటికి తీసుకెళ్ళి తినే బిర్యానిలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవకృష్ణా రెడ్డి. అయితే.. ఆ…
జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. మీరు మీరు కొట్టుకుని, చంపుకొని కూటమి పై మాట్లాడుతున్నారని, ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లను 24 గంటల్లో చెప్పు జగన్ అని ఆయన సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయిందని, ఇక జగన్ ను డ్రామాల రెడ్డిగా పిలుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. విధ్వంస పాలనను…
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీ మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 10 ఏళ్లుగా అమలు పరచకుండా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారని, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యాకేజి బావుందని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు రుద్రరాజు. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని,…
టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా అని, తిరోగమనంలో వెళ్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ…