ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది టీమిండియా. భారత్ బ్యాటింగ్లో స్మృతి మంధాన (60) హాఫ్ సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మంధాన ఇన్నింగ్స్ లో 47 బంతుల్లో 60 రన్స్ చేయగా.. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. దీంతో.. శ్రీలంక ముందు 166 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Read Also: Paris Olympics 2024: భారత్ ఖాతాలో తొలి పతకం..చరిత్ర సృష్టించిన మను భాకర్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓపెనర్లు షఫాలీ వర్మ (16) పరుగులు చేసినప్పటికీ, స్మృతి మంధాన నిలకడగా ఆడి జట్టుకు స్కోరును పెంచింది. ఆ తర్వాత.. రిచా ఘోష్ (30), జెమిమా రోడ్రిగ్స్ (29) రాణించారు. హర్మన్ ప్రీత్ కౌర్ (11), ఉమా శెట్టి (9), పూజా వస్త్రాకర్ (5) పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్లో కవిషా దిల్హారీ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత.. ఉదేశిక ప్రభోదిని, సచిని నిసన్సాల, చామిరి ఆటపట్టు తలో వికెట్ సంపాదించారు.
Read Also: Restaurant: ఫుడ్ ఆర్డర్‌తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కి రూ. 35000 ఫైన్..