ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కారులో ఉన్నవాళ్లంతా కిష్త్వార్ నుంచి వస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము రీజియన్‌లోని కిష్త్వార్ నుంచి వస్తున్న…
కర్నూలు నగర పరిధిలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం వనకాలం సీజన్లో నిలిచిన పంటలకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సిద్ధమైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు మినహా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ సహా అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, నీటి వనరులకు సరైన ఇన్ ఫ్లో రాలేదు. వాటి పరివాహక ప్రాంతాలలో వాగులతో పాటు, LMD , MMD…
ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. నీతి ఆయోగ్ భేటీ అనంతరం కేంద్ర మంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు కోరారు.
అక్బరుద్దీన్ ఆరోపణలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు అని, గుజరాత్, బీహార్ లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి…
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని మంథన్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న దైవిక్ తన పదేళ్ల వయసులో ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం బ్రిబుక్స్‌లో జాబితా చేయబడింది , ఆభరణాలను తయారు చేసే కళకు ప్రసిద్ధి చెందిన రాజ్యం గురించి , దొంగలు దోచుకున్న తప్పిపోయిన ఆభరణాల రహస్యాన్ని యువరాజు ఎలా విప్పాడు. కల్పిత కథ విడుదలైనప్పటి నుండి, పుస్తక ప్రియులచే ప్రశంసించబడింది, అయితే యువ రచయిత ఇటీవలే బ్రిబుక్స్ నుండి ప్లాటినం…
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయనుంది. యాపిల్ ఇప్పటికే భారతదేశంలో తాజా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్లతో సహా అనేక…
ఆగస్టు 2 వస్తుంది పోతుంది.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్.. ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుందన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించు కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు.…