Crop Loan Waiver: పంట రుణమాఫీకి సంబంధించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల పేర్లకు, సంఘాల నుంచి పంపిన జాబితాలలో చోటు లేకుండా సహకార శాఖ అధికారులు చేసినట్లు తెలిసింది.16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, కార్యదర్శులపై సస్పెన్షన్ వేటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 105 పీఏసీఎస్‌లకు సంబంధించిన కార్యదర్శుల సహకార శాఖ సంజాయిషీ కోరింది.
Read Also: Telangana: తెలంగాణలో 2జీ బయో ఇథనాల్ ప్లాంట్.. 500 మందికి ఉద్యోగాలు
ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతలుగా లక్షన్నర వరకు రుణమాఫీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాక ఆగస్టు 15న మూడో విడతలో రెండు లక్షల వరకు రుణాలను సర్కారు మాఫీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వైరాలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారని.. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుంటుందని పేర్కొ్న్నారు. రైతు రుణమాఫీలో ఏది బాగోలేక పోయినా అందుకు గత ప్రభుత్వమే కారణం కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకోవడం కోసం రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఈ నెలలో మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు. రైతాంగ మనోధైర్యాన్ని దెబ్బతీయ వద్దని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు చేసిన రుణమాఫీలో 30 వేల ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని ఆయన చెప్పారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ప్రకటన చేసిన మే నెల నుంచే రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. పాస్ బుక్ లేకపోయినా తెల్ల రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే 17 వేల ఖాతాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించామని.. గతంలో అధికారంలో ఉండి ఏమి చేయలేని వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.