రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55).. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన.. 1993లో ఇంగ్లాండ్ తరుఫున అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో గ్రాహం థోర్ప్ 16 సెంచరీలు సాధించాడు. అలాగే 6744 పరుగులు చేశాడు..
షాద్ నగర్ పట్టణ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి శిక్షించిన.. అంశంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం స్పందించారు. కేసు పూర్వపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, దళిత కుటుంబానికి అండగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు.
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని.. ఆ కార్యక్రమ పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా.. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల నాయకత్వంలో 8 నెలల క్రితం అధికారం ఇచ్చారని.. ఈ 8 నెలల కాలంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సీనియర్ మంత్రుల నాయకత్వంలో రైతు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.
ప్రేమించిన యువతి బంధువులు తన ఇంటిపై రాత్రి దాడి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్లో చోటుచేసుకుంది.