పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. అడ్డుకున్న నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
బెంగాల్ మాజీ సీఎం బుద్ద దేవ్ భట్టాచార్య మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుద్దదేవ్ భట్టాచార్యకు మృతికి చంద్రబాబు సంతాపం తెలిపారు. బుద్దదేవ్ భట్టాచార్య 25 ఏళ్లపాటు సీఎంగా పశ్చిమ బెంగాల్‌కు సేవలందించారని ఆయన తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరపనున్నారు.
ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం పనితీరు, ర్యాంకింగ్ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు.