దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేల కేంద్ర బడ్జెట్ ఉందన్నారు లోక్ సభ బీజేపి విప్ కొండ విశ్వేశ్వర రెడ్డి. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కన పెట్టీ …35 వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చిన కేంద్రమని, వాస్తవాలు పక్కన పెట్టీ… పార్టీలు రాజకీయాలు మాట్లాడతాయని, యూపీ, గుజరాత్ పేరు కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. ఎంపీలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వాలంటే… యూపీ, ఎంపీ లకు అధిక నిధులు ఇవ్వాల్సి ఉంటదన్నారు. ఎంపీల సంఖ్యతో సంబంధం లేకుండా బడ్జెట్ ఉంటుందని, ఒక వైపు మీ బడ్జెట్ బాగాలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇంకో వైపు మా బడ్జెట్ కాఫీ కొట్టారని అంటుందని, అంటే మీ ఐడియా బాగాలేదని ఒప్పుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
Vinod Kambli: దేవుడి దయతో అంత ఓకే.. వినోద్ కాంబ్లీ హెల్త్ అప్‌డేట్..
వక్ఫ్ బోర్డు లో కరప్షన్ జరుగుతుందని, దీనిపై చాలా తక్కువ ఆదాయం వస్తుందన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి. వక్ఫ్ బోర్డు సవరణలు అమల్లోకి వస్తె దానిపై వచ్చే ఆదాయం పెరుగుతుందని, వచ్చే సెషన్ లో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అవుతుందని ఆశిస్తున్నానన్నారు. కాళేశ్వరం వంటి లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ కాదు ప్రజలకు లబ్ధి చేకూరే చిన్న చిన్న ప్రాజెక్టుల మరమత్తులు చేయాలని, సీఎం అమెరికా పర్యటన నుంచి రాగానే ఆయన్ని కలిసి 111 జీవో సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తా అని, ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు నన్ను అయితే పిలుస్తున్నారన్నారు. మూసి డెవలప్మెంట్ మంచిదే అని, ప్రియరిటీ రాంగ్ ఉందన్నారు. మూసి ప్రాజెక్ట్ పై సమగ్ర పరిశీలన అవసరమని, మూసి ప్రక్షాళన ఒక ఆర్డర్ లో చేస్తే కేంద్ర సహకారం కూడా ఉంటుందన్నారు.
TG Govt: కొత్త రేషన్ కార్డుల మంజూరీపై ప్రభుత్వం కీలక అప్డేట్..