కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులకు దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు దగా, మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర మొత్తం మీద కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు జోగు రామన్న. మిగతా రైతుల సంగతేంటో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఒక సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసిందని ఆయన వెల్లడించారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులను ఇలా పచ్చిగా మోసం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
Jani Master: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా?
అంతేకాకుండా.. సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేసినందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తక్కువే అని, ఇప్పటికే మొదటి విడత రెండో విడత రుణమాఫీ జరుగక వేలాదిమంది రైతులు బ్యాంకుల చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ వ్యవసాయ శాఖ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మూడో విడత రుణమాఫీ దేవుడెరుగు అని, రుణమాఫీ విషయంలో రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే అదిలాబాదులో ఏ గ్రామానికి అయినా వచ్చి మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పై రైతులతో చర్చించాలి. తప్పులు తడకగా రుణమాఫీలో రైతుల లిస్టు అని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు, ప్రభుత్వం, పని చేస్తుందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. ఇచ్చిన హామీపై ఇచ్చిన మాట పై నిలబడని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోరు పారేసుకుని జనంలో నవ్వుల పాలవుతున్నారని జోగు రామన్న మండిపడ్డారు.
Demonte Colony 2: వణికి పోవడానికి రెడీ అవ్వండి.. “డిమాంటీ కాలనీ 2” వచ్చేస్తోంది!