Duvvada Vani: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటికి గత రాత్రి మాధురి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు. మాధురి ట్రాప్‌లో దువ్వాడ శ్రీనివాస్ పడ్డారంటూ మరోసారి విమర్శలు చేశారు. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తను, తన పిల్లలు వీధిన పడతారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు స్పందించి దువ్వాడ శ్రీనివాస్ గృహంలో ఉన్న అనధికార వ్యక్తులను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. రేపు లిఖిత పూర్వకంగా పోలీసులు పిర్యాదు చేస్తానంటూ దువ్వాడ వాణి వెల్లడించారు. మా కుటుంబ వ్యవహారంలో పార్టీ జోక్యం చేసుకోవాలని.. సమస్యను పరిష్కరించుకోవాలని జగన్ దువ్వాడ శ్రీనివాస్‌కు సూచించాలని వాణి కోరారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ మాధురి ట్రాప్‌లోనే ఉన్నారని.. భార్య , పిల్లలు ఏం చెబుతున్నా దువ్వాడ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Read Also: Kolkata rape case: తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు!