పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు దేశంలో అమ్మాయిల పెళ్లిళ్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నవయస్సులోనే అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, నగదు కొరత ఉన్న పాకిస్తానీ తల్లిదండ్రులు డబ్బుకు బదులుగా తమ తక్కువ వయస్సు గల కుమార్తెలను వివాహం కోసం వ్యాపారం చేస్తున్నారు.
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్.సి.మారక్(82) శుక్రవారం వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 82 ఏళ్ల వయస్సు గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మానవతా దృక్పథంతో భారతదేశం సుమారు 1400 కిలోల క్యాన్సర్ నిరోధక మందులను సిరియాకు పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియా పట్ల దేశం కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని, డ్రగ్స్ భారతదేశం నుండి పంపబడతాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. భారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. అదృష్టవశాత్తు ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రైళ్లల్లో రకరకాల పనులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాటలు పాడటం, మిమిక్రీ చేయడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఈ అక్క చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రైలులో మరో మహిళలకు థ్రెడ్ చేయడం కనిపిస్తుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని లోకల్ ట్రైన్ లో చోటు చేసుకుంది. ఈ దృశ్యం షాకింగ్‌గా ఉండటమే కాదు.. మహిళ చేసిన పనికి ప్రశంసలు…
కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే.. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని…
పారిస్ గేమ్స్‌లో వినేష్ ఫోగట్‌కు కోచ్‌గా ఉన్న వూలర్ అకోస్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ఒలింపిక్ ఫైనల్‌కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు.. వినేష్ దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ రకాల కసరత్తులు చేసినట్లు కోచ్ వూలర్ అకోస్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపాడు. ఈ సమయంలో ప్రాక్టీస్ తర్వాత చనిపోతుందేమోనని భయపడ్డామన్నాడు. తొలి ఒలింపిక్స్‌ను సాధించడానికి వినేష్ తన జీవితాన్ని లెక్క చేయలేదని కోచ్ తన పోస్ట్‌లో చెప్పాడు.
తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని…
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అనేక రకాల తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. హెర్నియా కూడా ఆ సమస్యలలో ఒకటి. దీని ప్రమాదం కూడా క్రమక్రమేణా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇంగువినల్ హెర్నియా అనేది ఒక రకమైన హెర్నియా. దీనివల్ల దిగువ ఉదర కండరాలలో బలహీనత సమస్య ఏర్పడుతుంది. దీనికి శస్త్రచికిత్స అవసరం. అయితే.. హెర్నియా సమస్య ఎవరికైనా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందాడు. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేష్ బంధువులు అతడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల…