CPI Narayana: బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చంద్రబాబు, నితీష్ కుమార్ సపోర్ట్‌తో ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను గవర్నర్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెడుతున్నారని.. కర్ణాటక సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భూమికి, మరో భూమి ఇస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి విషయంలో చంద్రబాబు చేసింది ఇదే కదా అంటూ పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న సీఎంను అవినీతి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు.
Read Also: CM Chandrababu: రేపు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
కేరళలో కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని.. రాజ్యాంగ వ్యవస్థను కాదని గవర్నర్ ద్వారా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో ప్రభుత్వ డాక్టర్ రేప్, మర్డర్ కేసులో జరిగింది సామూహిక అత్యాచారమని.. బెంగాల్ సీఎం మమత బెనర్జీ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఘాతుకానికి పాల్పడిన వారిని ఉరి తీయాలన్నారు. మోడీ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిత్యావసర వస్తువుల ధరలుపై నిరసన కార్యక్రమం చేస్తామన్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదని ఆయన తెలిపారు. విభజన బిల్లులో ఉన్న హామీ కోసం పోరాడడం లేదన్నారు. కేంద్రంతో సంబంధాలు బాగా ఉన్నాయని.. చంద్రబాబు రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు తీసుకురావాలని సీపీఐ నారాయణ సూచించారు.