రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ చండీ యాగంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు తీసుకున్న రుణమాఫీ 40 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి 16 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి…
నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్.. నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటన్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. సీఎల్పీ సమావేశంలో తన…
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటికి గత రాత్రి మాధురి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు.
రాజన్న సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానగా ముఖ్యమైన అంశాలు విశ్లేషించుకున్నామని, పరకాలకు సంబంధించిన విషయంపై హైదరాబాదులో మాట్లాడనున్నామన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగ పడుతుందని, టెక్స్ టైల్ పార్క్ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం చేసిందన్నారు మంత్రి పొంగులేటి. గతంలో వరంగల్…
కామారెడ్డి క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సన్మాన సభ. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. ఎంపీగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కార్‌ను షబ్బీర్ అలీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆడవాళ్ళకు బ్రేక్ డాన్స్ చేయిస్తా అన్న వారికి బుద్ధి చెబుతామన్నారు. మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్స్ కరెంటు కొన్ని…
ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి అని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలన్నారు. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి…
జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై పడేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం హంసలదీవి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా.. ముగ్గురిని తోటి పర్యాటకులు, మెరైన్ పోలీసులు కాపాడారు. ఇద్దరు సముద్రంలో గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.
Preity Zinta : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరూ బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే