ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. లోయర్ బెర్త్లోనైతా కిటికి పక్కన కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. అవసరమైనప్పుడు ఫ్రీగా బోగీలో నడవడానికి వీలుంటుంది. అదే మిడిల్ లేదా అప్పర్ బెర్త్ విషయానికి వస్తే అయితే.. పైనకు ఎక్కి పడుకోవాలి, లేదంటే ఫ్లోర్ పై నిలబడాలి అన్నట్టుగా ఉంటుంది. అందుకే లోయర్ బెర్త్‌కు డిమాండ్ ఎక్కువ.
విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని ఆయన మండిపడ్డారు. సరైన పరికరాలు లేకుండా చేశారని.. ఉద్యోగుల భర్తీని కూడా చేయలేదన్నారు.
నగరంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ప్రజలు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్లై ఓవర్, చెట్ల కింద తలదాచుకున్నారు. ‘రక్షాబంధన్’ సందర్భంగా మధ్యాహ్నం తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్న అనేక కుటుంబాలు వర్షంలో చిక్కుకుని మెట్రో ఫ్లైఓవర్ కింద వేచి ఉండాల్సి వచ్చింది. అరగంట తర్వాత వర్షం తగ్గిన తర్వాతే ముందుకు సాగారు. సికింద్రాబాద్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. షేక్‌పేట వద్ద సెంట్రల్ మీడియన్‌కు ఇరువైపులా వర్షం నీరు చేరడంతో…
సినిమా ఆర్టిస్టు హత్యకు గురయ్యారు. ఆర్టిస్ట్ ని చంపేసి ఆత్మహత్యగా భర్త చిత్రీకరించే ప్రయత్నం చేశారు చివరికి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ను హత్య భర్త చేసి పారిపోయాడు. పరారీలో భర్త శివరామయ్య కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన 36 సంవత్సరాల మహిళను అతని భర్త గొంతు నులిమి చంపాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీకి…
CM Chandrababu: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
కేటీఆర్‌కి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు బీఆర్ఎస్కి అధికారం ఉన్నా.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం అంటే తొలగిస్తాం అంటున్నాడని ఆయన మండిపడ్డారు. విదేశాల్లో చదువుకున్న వ్యక్తివి.. ఇవేం బుద్దులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఏం విగ్రహం పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం…
డిసెంబర్లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు.
అధికారులతో ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త టెక్స్టైల్ పాలసీపై చర్చించారు.
ఇటీవలే కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన వయనాడ్‌లో పంది మాంసం తినే ఛాలెంజ్‌పై తీవ్ర రచ్చ నెలకొంది. సహాయక చర్యల కోసం డబ్బు సేకరించేందుకు ప్రారంభించిన ఈ ప్రచారంపై ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) పోర్క్ ఛాలెంజ్‌పై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. ఇది ఏ మత సమాజాన్ని కించపరిచేలా చేయలేదని పేర్కొంది.