Andhra Pradesh: కలుషితాహారం తిని విద్యార్థుల మృతి.. రూ.10 లక్షల పరిహారం
- కలుషితాహారం తిని విద్యార్థులు మృతి
- విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు లేదా సంరక్షకులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు.
Read Also: CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 27 మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది హూటాహూటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక, తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్‌లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు. మిగతా 23 మందికి నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖ కేజీహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
Read Also: CM Chandrababu: కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని జాషువా, భవానీ, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సహచరుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నామన్నారు.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!