Healthy Diet: యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి మీ మెనూలో చేర్చుకోండి..!
- వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం.. ముఖంపై ప్రభావం
- ముఖంపై ముడతలు పడటం.. చర్మం వదులుగా ఉండటం..
- వృద్ధాప్యానికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు
- అందం కోసం క్రీములు.. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం
- వీటిల్లో ఉండే రసాయనాలు.. నిషేధిత పదార్థాల వల్ల సమస్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం, ముఖంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు పడటం, చర్మం వదులుగా ఉండటం.. ముఖం మెరుపు కోల్పోవడం వృద్ధాప్యానికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందు కోసం కెమికల్ అధికంగా ఉండే క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వీటిల్లో ఉండే రసాయనాలు, నిషేధిత పదార్థాల వల్ల దీర్ఘకాలంలో శరీరంలో అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
చర్మం.. ముఖంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలను నివారించడానికి, సౌందర్య ఉత్పత్తులకు బదులుగా వంటగదిలో సులభంగా లభించే యాంటీ ఏజింగ్ పదార్థాలను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాల ప్రమాదం ఉండదు. ఇవి.. అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. తద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇంతకీ అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
- The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
- UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
Child Trafficking Racket: శిశు విక్రయాల కేసులో సంచలన విషయాలు
కలబంద
అలోవెరా ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. ఇందులో ఉండే అనేక క్రియాశీల ఎంజైమ్‌లు, ఖనిజాలు.. విటమిన్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి. అన్నల్స్ ఆఫ్ డెర్మటాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన 2009 అధ్యయనంలో.. శాస్త్రవేత్తలు 45 ఏళ్లు పైబడిన 30 మంది ఆరోగ్యకరమైన మహిళల్లో ముడతలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో కలబంద యొక్క ప్రభావాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయనం 90 రోజుల తర్వాత కలబందను ఉపయోగించిన స్త్రీలు వారి చర్మంలో మెరుగైన మెరుగుదలని కనుగొన్నారు.
తేనె
తేనె చర్మానికి మేలు చేస్తుందని పరిశోధకులు నుగొన్నారు. తేనె చర్మ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ముడతలు ఏర్పడకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ యవ్వనంగా ఉంచుతంది. తేనె స్కిన్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. తేనెను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. యవ్వనంగా కనిపించడానికి యాంటీ ఏజింగ్ ఆహారాలు మంచి ఆహార పదార్థాలు.
దోసకాయ
ఇది అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దోసకాయలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి.. ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో.. చర్మానికి సంబంధించిన రుగ్మతలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ భాగాలు ముడుతలను నివారించడంలో సహాయపడతాయని 2011 అధ్యయనం కనుగొంది. ఇది అనేక చర్మ సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!