సికింద్రాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ చిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మూడో సారి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. సమైక్య పాలనతో పాటు గత ప్రభుత్వం కూడా వేడుకలు నిర్వహించాలేదని, కానీ కేంద్ర సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. పాఠ్యంశం లో తెలంగాణ చరిత్ర చేర్చాల్లన్న అలోచన త్వరలో ఫలిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఫోటో ఏక్సిబిషన్ ప్రతి ఒక్కరు తిలకించాలి,నిజం పాలన ను ఎక్సబిషన్ తెలియజేస్తుందని, 70 ఏళ్ల నుంచి విమోచన దినోత్సవం పై చర్చ లేదన్నారు. చరిత్ర ను తారుమారు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని, ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాం,చరిత్ర తారుమారు చేయాలని చూస్తే వారే తారుమారు అవుతారన్నారు.
Physical Harassment: కోల్‌కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు
అంతేకాకుండా..’అంత వల్లే పీకిండ్లు అన్నపుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమోచన దినోత్సవం జరపడం లేదు. అధికారాం లో రాక ముందు జై తెలంగాణ అన్నపుడు ఇప్పుడు ఏమైంది. వాళ్లు సమైక్య దినోత్సవం అన్నారు,వీళ్ళు ప్రజా పాలన అంటున్నారు..ఎప్పుడు ప్రజా వంచన దినోత్సవం అని పెట్టుకోండి బాగుంటుంది. తెలంగాణ వంచించిన పార్టీ చిప్ప పట్టింది,అప్పుడు గప్స్ ఇప్పుడు గొప్ప..తేడా ఏమీ లేదు. వారు ఆహ్వానం లేఖ పంపారు,మేము కూడా లేఖ పంపము.. మరి కార్యక్రమాం కు వస్తారా. ఎంఐఎం రజాకార్ల పార్టీ.. యద రాజా, తదా ప్రభ అన్నట్లుగా రాహుల్, MIM తీరు ఉంది..’ అని వారు వ్యాఖ్యానించారు.
Horrifying incident: చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..