Tirupati: మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిపై థియేటర్‌లో హత్యాయత్నం.. నిందితులు అరెస్ట్
- సినిమా థియేటర్‌లో జరిగిన హత్యాయత్నంను చేధించిన పోలీసులు
- ప్రియుడు కార్తీక్..ప్రియురాలు కావ్య అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Crime: తిరుపతిలో సినిమా థియేటర్‌లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన యువకుడు కార్తిక్, యువతి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన శనివారం జరిగింది. మూడు రోజుల తర్వాత తిరుపతి భారతీ బస్టాండ్‌లో ప్రియుడు కార్తీక్, ప్రియురాలు కావ్యను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. థియేటర్‌లో ప్రేమికుడి లోకేష్ హత్యకు మాజీ ప్రియుడు కార్తీక్‌తో కలిసి ప్రియురాలు కావ్య ప్లాన్ చేసినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం సినిమా చూస్తుండగా లోకేష్‌ను కత్తితో పొడవాలని కావ్య గట్టిగా అరిచింది. వెంటనే సినిమా చూస్తున్న లోకేష్‌ను కార్తీక్ కత్తితో పొడిచాడు. లోకేష్‌ను పొడిచి కావ్య, కార్తిక్‌లు పరారయ్యారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని లోకేష్ హత్యకు ప్రియురాలు కావ్య ప్లాన్ చేసినట్లు తెలిసింది.
Read Also: AP New Excise Policy: అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థి లోకేశ్ ఓ యువతితో కలిసి స్థానిక పీజీఆర్ థియేటర్‌లో సినిమాకు వెళ్లాడు. కార్తిక్ అనే యువకుడు లోకేశ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. కత్తితో దాడి చేసిన తరువాత కార్తీక్‌తో కలిసి యువతి పరారైంది. ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం నడిపింది. యువతి పక్కా ప్లాన్‌తో హత్యాయత్నం చేయించినట్లు తెలిసింది. ఈ ఘటనలో లోకేశ్‌కు యువతే సినిమా టికెట్లు బుక్ చేసింది. పథకం ప్రకారమే కార్తిక్‌తో యువతి దాడి చేయించిందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!