భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
AP New Excise Policy: అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం
ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశామని, నిమజ్జనం లో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్ లు ప్రకారం డ్యూటీ చేస్తున్నారన్నారు. లక్ష విగ్రహాలు సిటీలో ఉండొచ్చు, 20 నుండి 30 వేలు విగ్రహాలు పెండింగ్ ఉన్నాయని, రేపు ఉదయం లోగా నిమజ్జనం మొత్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. గత ఏడాది లాగా కాకుండా ఏడాది త్వరగా నే నిమజ్జనం అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లలో రావాలని కోరుతున్నామన్నారు. మీడియా లో వచ్చే లైవ్ టెలికాస్ట్ చూడాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు.
Purandeswari: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఉద్దేశం అదే.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు