వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు MGM ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య రోగిని తీసుకుని నేరుగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఫార్మసీ కేంద్రానికి చెరుకుని పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్ ను పరిశీలించారు. ఎన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయో ఎంపీ స్వయంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల వివరాలను సేకరించారు. స్వతహాగా డాక్టర్ అవ్వడం వలన క్షుణంగా మెడిసిన్స్ గురించి, సీడిఎస్ నుండి రావలసిన మందుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Samantha: హాస్పిటల్ బెడ్‌పై సమంత.. అందుకే అంటూ పోస్ట్
దాదాపు మూడు నెలలుగా మెడిసిన్స్ అందుబాటులో లేకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫార్మసీ సిబ్బందిపై ఎంపి డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పెద్దదిక్కుగా ఉన్న MGM ఆసుపత్రిలో కనీసం పెయిన్ కిల్లర్స్ కూడా అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. మందులు అందుబాటులో లేవు అంటూ బయటకు రాయడం సరికాదని, మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం విషయాన్ని ఎంపీ డా. కడియం కావ్య మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ డా.కడియం కావ్య గారు అందించిన వివరాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వైద్య అధికారులను మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు అందాల్సిన విద్యా, వైద్యం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌పై రేపు చర్చలు