జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి అర్హతకు అనుగుణంగా కల్పించాలని భావనతో సీఎం రేవంత్ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం గా ఆరంభించడం హర్షనీయమన్నారు. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం కొరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు జీవన్ రెడ్డి. దశబ్దకాలం…
పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ విషయానికి సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో బుధవారం నాడు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు MGM ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పార్థసారధి ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియడంతో ప్రభుత్వం రాణి కుముదిని నియమించింది. 1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర…
రాష్ట్రం అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రూ.…
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024’లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు.
ఇటీవల ఏపీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరో అప్డేట్ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం…
తిరుపతిలో సినిమా థియేటర్లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది.