Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది..
- తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిది
- భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారు
- భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారన్నారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారని పవన్ వెల్లడించారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయన్నారు.
భక్తులు ఏ ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిర్దకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలో నియమితమైన టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికి ఎందుకు ఉత్సాహపడిందని ఆరోపించారు. వారిని ఆ విధంగా నడిపించింది ఎవరు? అనేది బయటకు తీస్తామన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్ళకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు వస్తున్నాయి.తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. ఈ క్రమంలో గత పాలక మండళ్ళు టీటీడీ ఆస్తులు విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలన్నారు. వైసీపీ పాలకులు నియమించిన పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని, ఆ ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారన్నారు. నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించిందన్నారు. గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అంబర్ పేట కలాన్ ప్రాంతంలో స్థలం, మల్కాజిగిరి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఫ్లాట్, నాందేడ్, బెంగళూరుల్లోని కొన్ని ఆస్తులు అమ్మకానికి సిద్ధం చేసిందని పవన్ అన్నారు.
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న మా పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బాధ్యతగా, బలంగా స్పందించాము, అప్పుడు వేలం ద్వారా విక్రయం ఆగిందన్నారు. ఆభరణాలు, నగలను పరిశీలించాలన్నారు. అదే విధంగా తిరుమల శ్రీవారికి కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు నగలు, ఆభరణాలు అందజేశారని పవన్ చెప్పారు. వాటి జాబితాను కూడా పరిశీలించి.. వాటి పరిస్థితిని కూడా గణించాలని టీటీడీ అధికారులకు సూచిస్తున్నామన్నారు. ఎందుకంటే స్థిరాస్థులను ఆమ్మేయాలని చూసిన వాళ్ళు ఆభరణాలు, బంగారం విషయంలో కూడా కచ్చితంగా పెడపోకడలతో ఏవైనా అవాంచనీయ నిర్ణయాలు తీసుకున్నారా అనే అనుమానం ఉందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయం ఎటు వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి భక్తుడి నుంచి రూ.10,500 తీసుకున్నారని.. ఇందులో బిల్లు రూ.500కే ఇచ్చారన్నారు.
ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్ళు ఎటు మళ్లించాయో కూడా విచారణ చేయాలని సీఎంను కోరామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని అప్పటి పాలకులు చెప్పారన్నారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? సంస్థ ఏమిటని ప్రశ్నించారు. ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియచేయడం అవసరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాదు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని సీఎంకి సూచిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖాలు పెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల వివరాలు, సదరు ఆస్తుల ద్వారా వస్తున్న రాబడినీ ప్రజలకు తెలియచేయడం అవసరమన్నారు. భక్తులకు వివరాలు అందుబాటులోకి వస్తే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయన్నారు. ఆలయాల పాలక మండళ్ళు జవాబుదారీ తనంతో పని చేస్తాయన్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!