Home
Telugu News
Telugu News News
-
DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..
పోలీసు అమరవీరుల దినోత్సవం, గణపతి నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. -
AP Govt: వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
Breaking: కామారెడ్డిలో హై టెన్షన్.. పోలీసులపై రాళ్లు, సీఐ తలకు గాయం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది. -
Amaravati: రాజధానిలో తొలి భూ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వం
ఏపీ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం తొలి భూ కేటాయింపు చేపట్టింది. ఎంఎస్ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల భూమిని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఉచితంగానే కేటాయించింది -
Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. -
Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. మైనంపల్లి హాట్ కామెంట్స్
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు. వాళ్ళని ఏమి అనవద్దు.. వాళ్ళు కూడా మనవాళ్లే అని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ తనకు ఇష్టం అని తెలిపారు. రూ. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు. -
AP CM Chandrababu: తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి సీఎం చంద్రబాబు
సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు. -
Aadi Srinivas: నాలుక, ఒళ్ళు దగ్గర పెట్టుకో.. కేటీఆర్‌పై ఫైర్
బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో.. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Ponguleti Srinivas Reddy : కేటీఆర్ కి పొంగులేటి సవాల్.. బావా బామ్మర్దుల మధ్య విభేదాలు అందరికి తెలుసు
బీఆర్ఎస్ లో ఉన్న బావా బామ్మర్దుల మధ్య ఉన్న అనుబంధం ఏంటో వారి మధ్య ఉన్న విభేదాలు ఇంటిలో వారు ఎప్పుడూ ఎక్కడా వెన్నుపోట్లు పడుకుంటారో ప్రజలందరికీ తెలుసు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నువ్వు నీ పింక్ కలర్ పేపర్లు నీ పింక్ కలర్ యూట్యూబ్ ర్లు నామీద దుష్పప్రచారం చేస్తున్నారు .నేను సవాల్ చేస్తున్నాను నేను ఎఫ్ తో ఎల్ లో ఇల్లు కట్టుకున్నానని చేస్తున్న ఆరోపణలు నిరూపించు.. బావా బామ్మర్దులు…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!