AP Govt: వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
- వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన కూటమి ప్రభుత్వం
- కార్పొరేషన్ల సభ్యుల జాబితాలో జనసేనకు 9..బీజేపీకు 5 పదవుల కేటాయింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీలో 10 మంది డైరెక్టర్లు నియామకమయ్యారు. మార్క్ ఫెడ్‌లో ఆరుగురు, ట్రైకార్లో ఐదుగురు సభ్యులు నియామకమయ్యారు. విత్తనాభివృద్ధి సంస్థలో ఇద్దరు, వినియోగదారుల రక్షణ మండలిలో ఒకరిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం విడుదలైన కార్పొరేషన్ల సభ్యుల జాబితాలో జనసేనకు 9, బీజేపీకి 5 పదవులను కేటాయించారు. మిగిలిన కార్పొరేషన్లల్లోనూ సభ్యుల నియామకంపై కసరత్తు కొనసాగుతోంది.
Read Also: Amaravati: రాజధానిలో తొలి భూ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వం
Also Read
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. వివిధ కార్పొరేషన్లకు ఛైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్ పోస్టులు దక్కాయి.. అయితే, నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!