Aadi Srinivas: నాలుక, ఒళ్ళు దగ్గర పెట్టుకో.. కేటీఆర్‌పై ఫైర్
- కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు
- కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో
- పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా- ఆది శ్రీనివాస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో.. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతవా అని దుయ్యబట్టారు. ఆనాడు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్నది ఎవరు..?.. ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు..?.. ఆనాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్‌కు తీసుకుపోయిన వెధవన్నర వెధవ ఎవరు..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనం అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరు..? అని కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ మాటల యుద్ధం చేశారు.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
పార్టీలకు పార్టీలను మింగేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని నంగనాచి కబుర్లు చెపుతావా…? అని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు నువ్వు, నీ అయ్య ప్రదర్శించిన అతి తెలివిని తెలంగాణ జనం చూశారు.. తెలంగాణలో సిగ్గు, లజ్జ, మర్యాద లేని బతుకులు కల్వకుంట్ల కుటుంబానివి అంటూ ఆరోపించారు. మీ ఫిరాయింపుల భాగోతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కేటీఆర్ నీ సుద్దపూస ముచ్చట్లు ఆపు.. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కేటీఆర్ పదేపదే ఎందుకు మాట్లాడుతున్నాడు…? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు ఛీత్కరించినా రోజు ఏదో ఒక వంకతో మీడియా కోసం సొల్లు వాగుడు వాగుతున్నవు…?.. లోక్ సభ ఎన్నికల్లో జీరో చేసినా నీకు, నీ అయ్యకు బుద్ధి రాలేదంటూ నిప్పుల కుంపటిలా చెలరేగాడు.
Speaker Prasad: నితిన్ గడ్కరీని కలిసిన స్పీకర్.. నిధులు మంజూరు చేయాలని వినతి
తెలంగాణలో నీకు నూకలు చెల్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి… మా ముఖ్యమంత్రిని ఆడిపోసుకోవడమే నీ దొంగల ముఠాకు పనిగా మారిందంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు మోసం చేశారని వేమన శతకాలు చదువుతున్నవా కేటీఆర్… పదేళ్లలో నువ్వు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చేయించింది ఏమిటీ..? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నువ్వు చేస్తే సంసారం.. పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారమా..? అని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడుతున్నావు.. ఇప్పటికే వచ్చిన ఎన్నికల్లో నువ్వు చేసింది ఏమిటి..?.. అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్‌లో చిత్తు చిత్తు చేశాం.. కంటోన్మెంట్ బై ఎలక్షన్ నిన్ను అడ్రస్ లేకుండా చేశామని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే నిన్ను, నీ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తాం.. కేటీఆర్.. ఈసారి మాట్లాడేటప్పుడు నాలుక, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!