మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు. వాళ్ళని ఏమి అనవద్దు.. వాళ్ళు కూడా మనవాళ్లే అని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ తనకు ఇష్టం అని తెలిపారు. రూ. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు.
సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో.. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ లో ఉన్న బావా బామ్మర్దుల మధ్య ఉన్న అనుబంధం ఏంటో వారి మధ్య ఉన్న విభేదాలు ఇంటిలో వారు ఎప్పుడూ ఎక్కడా వెన్నుపోట్లు పడుకుంటారో ప్రజలందరికీ తెలుసు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నువ్వు నీ పింక్ కలర్ పేపర్లు నీ పింక్ కలర్ యూట్యూబ్ ర్లు నామీద దుష్పప్రచారం చేస్తున్నారు .నేను సవాల్ చేస్తున్నాను నేను ఎఫ్ తో ఎల్ లో ఇల్లు కట్టుకున్నానని చేస్తున్న ఆరోపణలు నిరూపించు.. బావా బామ్మర్దులు…
సోమవారం అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.., 'మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఔచిత్యానికి మెరుగుదల కీలకం' అని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలి డిజిటల్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటిని ఒకే కార్డు ద్వారా అందించాలని భావిస్తోంది. ఈ అంశంపై వైద్యారోగ్య, పౌరసరఫరాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని, వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి ఒక…
ఆ ఎమ్మెల్యే అడుసు తొక్కేసి కాలు కడుక్కోవడానికి, కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? పవర్ ఉంది కదా అని రెచ్చిపోయి నోటికి పని చెప్పిన శాసనసభ్యుడికి ఆ పవర్ కట్ చేస్తామంటూ పార్టీ పెద్దల నుంచి వార్నింగ్ వచ్చిందా? ఆయనగారి నోటి దురుసుపై సొంత పార్టీ నేతలు సైతం ఒక్కొక్కరే బయట పడుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బూతు పురాణం?
మళ్లీ ఆకాశానికి రారాజుగా ఎయిర్ ఇండియా? “టాటా గ్రూప్” ప్లాన్! ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానయాన సంస్థల్లో ఒకటి. జనవరి 2022లో.. ఇది ఏడు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్‌కి తిరిగి వచ్చింది. టాటా మరోసారి దానిని ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానయాన సంస్థగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం టాటా గ్రూప్ ఐదేళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని కింద ఎయిర్ ఇండియా విమానాలకు కొత్త విమానాలు జోడించనున్నారు. ఐటీ వ్యవస్థలు పునఃరూపకల్పన చేయనున్నారు. అంతర్గత…
ఉన్నత విద్యశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్సులో రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు వెనుకబడి ఉండటంపై మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.