AP CM Chandrababu: తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి సీఎం చంద్రబాబు
- రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సందర్శించిన సీఎం చంద్రబాబు
- అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి వెళ్లిన ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్‌లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఆర్టీజీఎస్ వ్యవస్ఖ మారింది. ఆర్టీజీఎస్ సెంటర్‌లో సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌరసేవలను సులభతరం చేయడం.. పాలనలో వేగం పెంచడంపై సమావేశంలో చర్చించారు.
Read Also: Prakash raj: పవన్ కళ్యాణ్ ఫైర్.. వీడియో రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్
Also Read
ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సిస్ చేసుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆధార్, వాక్సినేషన్ డాటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్‌గా అందే అంశంపై చర్చించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై చర్చించారు. సీసీటీవీ కెమేరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, నాణ్యతపై సమావేశంలో చర్చించారు. రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని సీఎం తెలిపారు. రియల్ టైం గవర్నెస్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
తాజావార్తలు
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!