హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారన్నారు. ధైర్యంగా బీసీల కులగణన గురించి మాట్లాడుతున్న ఛాంపియన్ రాహుల్ గాంధీ అని,…
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు, వాటి పరిధిలో ఉండే ఉపాధ్యాయులు మరణిస్తే వారి వారసులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. తన కార్యాలయానికి కారుణ్య నియామకాలుపై పలు అర్జీలు వస్తున్న దృష్ట్యా డిప్యూటీ సీఎం ఈ అంశంపై అధికారులతో సమావేశమయ్యారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు.
ఉన్నత విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం.. పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు తీసుకు రావాలన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ అల్లుడు సొంత మేనత్త ఇంటికి కన్నం వేశాడు. పెళ్లి సంబంధం కోసం వచ్చి మేనత్త ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిన ఘటన పార్వతీపురం మండలంలో గల పెదబొండపల్లిలో జులై 27న జరిగింది.
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ సాయం అందించింది. హైదరాబాద్లోని హయత్నగర్లో 600 చదరపు గజాల స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. కాగా.. ఆ ఇంటి స్థలం ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగిలయ్యకు అందజేశారు. మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా ఉన్నారు. కాగా.. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.
డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది.