కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న రైతు హామీల సాధన కోసం దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు అందజేయగా.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు.
మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. యాక్షన్ ప్లాన్ పై సెక్రటేరియట్లో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పోలీసు అమరవీరుల దినోత్సవం, గణపతి నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.
ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది.
ఏపీ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం తొలి భూ కేటాయింపు చేపట్టింది. ఎంఎస్ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల భూమిని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఉచితంగానే కేటాయించింది
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.