Off The Record: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక ఆర్.కృష్ణయ్య వ్యూహం ఏంటి..?
- ఆర్.కృష్ణయ్య వ్యూహాత్మకంగా అడుగులేయబోతున్నారా?
- కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా?
- జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఆఫర్ ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య పొలిటికల్ అడుగులు తడబడుతున్నాయా? లేక తడబాటును సరి చేసుకుంటున్నారా? రాజకీయ రంగుల కంటే ఉద్యమ పంథానే బెటరని అనుకుంటున్నారా? లేక కొత్త పార్టీ గడప తొక్కబోతున్నారా? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక కృష్ణయ్య వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?
దశాబ్దాల తరబడి బీసీ హక్కుల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు ఆర్.కృష్ణయ్య. అట్నుంచి పొలిటికల్ ప్రవేశం చేసి వివిధ పార్టీల మీదుగా రెండేళ్ళ క్రితం వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్ళారాయన. ఇంకో నాలుగేళ్ళ పదవీకాలం ఉండగానే… తాజాగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఆయన అడుగులు మారుతున్నాయా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. బీసీ సంఘం నేతగా మొదలైన కృష్ణయ్య.. ఆ తర్వాత రాజకీయంగా వేసిన అడుగులు…అన్నీ ఇన్నీ కావు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన పార్టీల వేదికలు ఎక్కిన వ్యక్తే. 2014లో టిడిపి అధినేత చంద్రబాబు… ఎల్ బి నగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి.. ఎమ్మెల్యేగా గెలిచారు కృష్ణయ్య. అప్పట్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే… కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పారు. కానీ…రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకం కావడంతో…కృష్ణయ్య కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. తిరిగి.. 2018 ఎన్నికల నాటికి… కాంగ్రెస్ గూటికి చేరారు కృష్ణయ్య. నామినేషన్ వేసేందుకు ఆఖరి నిమిషంలో పిలిచి బీ ఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన.
Also Read
ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో ఎక్కడా యాక్టివ్‌గా కనిపించలేదు. కొన్నాళ్ళు తిరిగి బీసీల సమస్యలపై పోరాటం చేశారు. ఇంతలో ఏపీ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం పిలిచి… రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. బీసీ లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు అయ్యారు కృష్ణయ్య. బీసీ హక్కుల సాధన కోసం పార్లమెంట్‌ను వేదికగా మలుచుకుంటానని నాడు చెప్పిన కృష్ణయ్య…. ప్రస్తుతం ఆ పదవికి కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. ఈ పరిస్థితుల్లో తిరిగి ఆయన అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. అటు బీజేపీ అగ్ర నాయకత్వం..కృష్ణయ్యకి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను క్యాష్ చేసుకునే పనిలో ఉన్న బీజేపీ.. ఆర్. కృష్ణయ్యని తనవైపు తిప్పుకుంటే తెలంగాణలో ప్లస్ అవుతుందన్న లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తమ పార్టీలోకి తీసుకుని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన అడుగులు కాషాయ పార్టీవైపేనన్న వాదన బలపడుతోంది. కానీ… అట్నుంచి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. ఐతే కృష్ణయ్య మాత్రం.. బీసీ జెండా, అజెండాతోనే నా అడుగులు అంటున్నారట. ఆ ప్రకారం చూస్తే… జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తే బీజేపీ వైపు వెళ్తారన్న వాదనకు బలం చేకూరుతోందంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!