Minister Seethakka: నేడు ఢిల్లీకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెళ్లనున్నున్నారు. పెసా చట్టంపై జరిగే జాతీయ సదస్సుల్లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. పెసా చట్టంపై ఇవాళ కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరుగనుంది. న్యూ ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో పెసా చట్టం అమలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సదస్సుకు మంత్రి సీతక్క హాజరవుతున్నారు. ఆదివాసీ, గిరిజనుల అభివృద్ది, పెసా చట్ట అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ప్రసంగించనున్నారు సీతక్క. పంచాయతీల నిబంధనల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 PESA చట్టంగా సంక్షిప్తీకరించబడింది. భారతదేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం సాంప్రదాయ గ్రామసభల ద్వారా స్వయం పాలనను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన చట్టం, షెడ్యూల్డ్ ప్రాంతాలు భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ద్వారా గుర్తించబడిన ప్రాంతాలు. షెడ్యూల్డ్ ప్రాంతాలు భారతదేశంలోని పది రాష్ట్రాల్లో గిరిజన సంఘాలు అధికంగా ఉన్నాయి.
OTT – ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సీరిస్ లిస్ట్…