రేపు ఢిల్లీకి మంత్రి సీతక్క వెళ్లనున్నున్నారు. పెసా చట్టంపై జరిగే జాతీయ సదస్సుల్లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. పెసా చట్టంపై గురువారం నాడు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరుగనుంది. న్యూ ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో పెసా చట్టం అమలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున సదస్సుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా…
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కీలక సదస్సుతో మౌలిక వసతుల రంగంలో వృద్ధి, నూతన పెట్టుబడుల అన్వేషణకు, పెట్టుబడుల్లో భాగస్వామ్యానికి మంచి అవకాశం లభించినట్లైందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి అన్నారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
తిరుమల వ్యవహరం జగన్‌కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో కేటీఆర్ తెగ డ్రామాలు ఆడుతున్నాడంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరాన్ని తానే తీర్చిదిద్దినట్లు గా తెగ హడావిడి చేస్తున్నాడని, హైదరాబాద్ నగర సృష్టి కర్త కేసీఆర్ అయితే తాను నగిషీలు దిద్దాను అన్నట్లు కేటీఆర్ ఫోజులున్నాయని, వినే వాళ్లు అమాయకులైతే హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టింది కల్వకుంట్ల కుటుంబం అని చెపుతాడేమో అని ఆయన అన్నారు. కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని నగరంలో తిరుగుతున్నాడు…? అని ఆయన ప్రశ్నించారు.…
వరద బాధితులకు గుడ్‌న్యూస్.. 4 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ.. వరద బాధితులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు…
గాంధీ భవన్లో మొదటి రోజు ముఖాముఖి కార్యక్రమంలో ముగిసింది. ఈ సందర్భంగా 285కు పైగా అప్లికేషన్లు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. హెల్త్ ఇష్యూస్, 317 బాధితులు, భూ వివాదం, అక్రమ కేసులు, బదిలీలు అంటూ ఫిర్యాదు అందాయి. బీఆర్ఎస్ హయంలో రౌడీ షీట్ పెట్టారంటూ మంత్రి ముఖాముఖిలో సిరిసిల్లకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడు. కేటీఆర్ తనపై తప్పులు కేసులు నమోదు చేశాడని ఫిర్యాదు చేశాడు సదరు యువకుడు. 30 ఫిర్యాదులను అప్పటికప్పుడు అధికారులకు ఫోన్…
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ హరి భూషణ్ శర్మను కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, కాలేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ప్రిపరేషన్ అంశాలపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? సిబ్బంది ఉద్యోగుల జీతాలు ఎవరి చెల్లించారు…
తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు.
హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీసీని పీసీసీ చేస్తామనీ రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడన్నారు. నా రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదని, జనాభా ప్రతిపాదికన ఎవరి హక్కులు…