తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో, ఎదుగుదలలో పాలుపంచుకోవాలని అమెరికన్ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఆయన అమెరికాలోని లాస్ వేగాస్ లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో పాల్గొన్న అనంతరం పలు అమెరికన్ కంపెనీల ప్రతినిథులతో సమావేశమయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సి&ఎండి ఎన్.బలరామ్ , స్పెషల్ సెక్రెటరీ కృష్ణభాస్కర్,…
నంద్యాల జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. తండ్రి బతికుండగానే చనిపోయాడని కుమారుడు లోకేష్ ఆస్తిని అమ్మేశాడు. తండ్రి బ్రతికి ఉన్నాడంటూ తండ్రితో కలసి పెద్ద కుమారుడు రామకృష్ణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య పొలిటికల్ అడుగులు తడబడుతున్నాయా? లేక తడబాటును సరి చేసుకుంటున్నారా? రాజకీయ రంగుల కంటే ఉద్యమ పంథానే బెటరని అనుకుంటున్నారా? లేక కొత్త పార్టీ గడప తొక్కబోతున్నారా? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక కృష్ణయ్య వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞాపన పత్రం అందచేశారు.
తమిళనాడులో భారీ పేలుడు.. తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మూడు లారీల్లో ఒకదానికొకటి వెనువెంటనే మంటలు అడ్డుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పోగా కమ్ముకున్నాయి. గోడౌన్ లో లారీని ఎక్కించే టటువంటి కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరకున్న…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు బయటికి ఎక్కువగా రావడం లేదు? ఎన్నికల తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించడం వెనకున్న అసలు రీజనేంటి? బయట జరుగుతున్న రకరకాల చర్చలకు మించిన మాస్టర్ ప్లాన్ ఉందా? నన్ను ఓడిస్తే... వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని గతంలో అన్న మాటల్ని నిజం చేస్తున్నారా? లేక సమయం ఉంది మిత్రమా.... అంత తొందరేల అంటున్నారా? అసలేం జరుగుతోంది?
పాలమూరు రంగారెడ్డ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల్లోపు ఉదండాపూర్, బీమా, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో గత ప్రభుత్వం 22,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరందించలేదని, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి…
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామ సమీపంలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కంటైనర్ లారీలో సుమారు ₹2.25 కోట్ల విలువైన 900 కిలోల బరువున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూలాల ప్రకారం, చెక్ పోస్ట్ వద్ద కొద్దిసేపు వెంబడించిన తర్వాత ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల కంటైనర్ లారీని వేగంగా వస్తున్న పోలీసు బృందం అడ్డగించింది. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు పట్టుకున్న అత్యధిక మొత్తం…
కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సుతిమెత్తని హెచ్చరిక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సామాన్యుల కంటే పదవులు పొందిన వారు ప్రత్యేకం కాదనే స్పృహతో పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల విషయంలో కామెంట్లు చేసిన వారికి సీఎం క్లాస్ తీసుకున్నారు.