సినీనటి కరాటే కళ్యాణి(karate kalyani) దత్తపుత్రిక వివాదంపై అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కళ్యాణి నివాసంలో ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడిని చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ స్కీం అధికారులు ప్రశ్నించారు. కరాటే కళ్యాణి అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకున్నారంటూ 1098 నంబర్ కు ఫిర్యాదు వచ్చిందని.. అందుకే పోలీసుల సహకారంతో వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు విచారణ జరుగుతున్న సమయంలో కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి, తమ్ముడిని ప్రశ్నించామన్నారు. నగరంలోనే ఓ…
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. TRS పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందని ఎద్దేవ చేశారు. రైతులను ఆదుకోవాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజా…
రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. క్రిష్ణా జిల్లా పెద్దపాలపర్రులో ఆయన జన్మించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య…
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హోదాలు, విధులు వేరైనా అందరం ప్రజలకు సేవకులం అని, వారికి మంచి వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాక మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. అవసరం లేకున్నా గర్భిణులకు…
నల్గొండలో నేడు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండ టౌన్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నార్కట్ పల్లిలో చిరుమర్తి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. గతంలో ఆదేశించిన మేరకు…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ ప్రసాద్ సిద్ధార్థ్ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈ క్రమంలో శ్యామ్ సుందర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కాగా శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన నిఖిల్.. సక్సెస్ ఫుల్ హీరోగా…
నిర్మాత నట్టి కుమార్ తో తనకున్న విభేదాలపై రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు స్పందించాడు. అయితే… తనవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటూ వర్మ విమర్శించడాన్ని నట్టి కుమార్ ఖండించాడు. వర్మ బాధితులు చిత్రసీమలో ఎంతో మంది ఉన్నారని చెప్పాడు. అయితే నట్టి కుమార్ చేసిన తాజా విమర్శలపై గురువారం ఆర్జీవీ మరోసారి స్పందించాడు. తన జవాబును ప్రెస్ నోట్ రూపంలో మీడియాకు విడుదల చేశాడు. అందులో నట్టి కుమార్ ను సూటిగా ప్రశ్నిస్తూ… శరాలను సంధించాడు…
ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్‌బ్రాండ్‌కు పూలు.. ముళ్లు తప్పవా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్కగా రాజకీయం ఉంటుందా? ఇన్నాళ్లూ ఆమెను ఫ్లవర్గానే చూసిన పార్టీలోని ప్రత్యర్థులకు ఇకపై ఫైర్ చూపిస్తారా? నగరి వైసీపీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారా? చిత్తూరు జిల్లాలోని వైసీపీ రాజకీయాలు ఒక తీరున ఉంటే.. నగరిలో మరోలా ఉంటాయి. అక్కడ నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ప్రస్తుతం మంత్రి అయ్యారు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా…
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చేలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి…
కరోనా రక్కసి కొత్తకొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకోస్తున్నాయి. డెల్టావేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఒమిక్రాన్ వేరియంట్లకు ఉంది. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా, నైట్ లాక్డౌన్, వీకెండ్ లాక్డౌన్ ను విధించి థర్డ్‌వేవ్‌కు అడ్డుకట్టవేశాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్…