Karimnagar Crime: కరీంనగర్ జిల్లాలోని దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలంలో రామకృష్ణ కాలనీలో తల్లీకూతుళ్లపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడిచేశారు. ఈదాడిలో కూతురు అక్కడికక్కడే మరణించగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.
read also: Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..
గురువారం రాత్రి రామకృష్ణ కాలనీకి చెందిన తల్లి బాలవ్వ, కూతురు సులోచన ఇద్దరు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రిస్తున్న తల్లీకూతుళ్ల పై కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు సులోచనకు తీవ్రంగా రక్త శ్రావ్యం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇక తల్లి బాలవ్యకు రక్తపు మడుగులో పడి వుండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి సులోచన మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణం భూతగాదాలే అని స్థానికులు తెలుపడంతో పలు అనుమానాలకు తావులేపుతోందని పోలీసులు తెలిపారు. ఈఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
Bigg boss 6: అది పిచ్చోళ్ళ స్వర్గం! చూసేవాళ్ళకు నరకం!!