Telangana Wether: వరణుడు మళ్లీ తమ ప్రభావాన్ని చూపించనున్నాడు. నేడు, రేపు జల్లులతో కూడి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడిందంటే సెంటీమీటర్లలో ఉంటుంది.. ఈ మధ్య హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వానలు దంచికొట్టాయి.. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.. నేటి నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందంటున్న వాతావరణం కేంద్ర మరోవైపు, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు.. వీటి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వరుసగా దంచికొడుతోన్న వర్షాలతో తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటతో నష్టం జరుగుతోందంటున్నారు.
Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర