కేంద్రంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. దక్షిణ భారత దేశంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. నల్లగొండ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.23వేల కోట్ల నిధులు కేంద్రం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర విధానాలు దేశమగ్రతకు మంచిది కాదని.. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బ్రాహ్మండంగా…
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. నేడు (బుధవారం) సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఫుట్ పాత్ నిర్మాణం,14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సిద్దిపేటను…
జూలై 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈసమావేశం ప్రగతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి, విధానాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాటాలని పిలుపునివ్వనున్నారు. ఈనేపథ్యంలో.. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా…
కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలు పెడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్ననగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. అయితే.. బుధవారం జియాన్.. షాంఘై నగరాల్లో 300పైగా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎదుర్కొన్న లాక్ డౌన్ గురించి తలుచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నుంచి రేషన్ అందిందని షాంఘై ప్రజలు సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. తాజాగా విజృంభణ…
సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) 4వ తేదీ రాత్రి రెండు గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మి గత యేడాది నవంబర్ లో మరణించారు. వారికి ఓ అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన శ్రీహరి గతవారం ఇంటిలో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే నిమ్స్ లో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఇతర అనారోగ్య సమస్యతో సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కుమారుడు శ్రీరామ్…
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి షురూ అయ్యింది. నేడు గోల్కొండ కోట బోనమెత్తింది. బంగారు బోనానికి లంగర్ హౌజ్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. తొట్టెలకు స్వాగతం పలికి.. శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందని, ప్రతి ఆలయానికి ఆర్ధిక…
ఓ సంఘటన అచ్చం కంచె సినిమా సీన్ ను గుర్తుచేసింది. బాలుడు బోరు బావి వద్ద నీరు తాగడంతో..ఇరు వర్గాల వారు దాడి చేస్తుకున్న ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయలయ్యాయి. గ్రామంలో ఘర్షణలు తావు లేకుండా వుండేందుకు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. బాలుడు నీరు తాగడం వల్లే ఈ…
రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్కార్డులు జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నేడు నగరంలో కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘మీ శాసనసభ్యుడు, కార్పొరేట్ల చేతుల మీదుగా.. మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా.. ఎవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీమే.. మీ కార్పొరేటరే వచ్చి.. ఎవరు ఎవరు అర్హులున్నారో ఒక్కరూ మిస్ కాకుండా ఇచ్చే…
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత నిరసనకు తెరపడింది. సోమవారం అర్ధరాత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. నేటి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరువుతామని ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువీడకుండా ఆందోళన చేస్తుండటంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి…
నిజామాబాద్ జిల్లా పర్యటనకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయనను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరా తీయగా, జిల్లాలో కేంద్ర పథకాల అమలు సమర్థవంతంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ముద్ర రుణాల పంపిణీలో నిజామాబాద్…