ఎంఎన్‌జే క్యాన్సప్ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు.. ఎంపీ విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ శరత్‌తో కలిసి సందర్శించారు. ఆసుపత్రి పెండింగ్ పనులు, కొత్త బిల్డింగ్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నేటితో(ఆదివారం)ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుతో.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా.. అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులను స్మరించుకున్నారు. తెలంగాణలో…
సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించామని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల బహిరంగ సభలో ఆయన మట్లాడారు. ఈ మధ్య కొన్ని శక్తులు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయని అన్నారు. మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారికి అధికారం పోతే అభివృద్ధి కుంటు పడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా మాట్లాడే కొంతమంది…
Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…
Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం లేని వారు ఆ పాత్రను హైజాక్ చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణా ప్రస్తావన అంటేనే కమ్యూనిష్టులని, వారులేకుంటే తెలంగాణే లేదని గుర్తు చేశారు. త్యాగం ఒకరిది భోగం ఒకరిదని మండిపడ్డారు. సాయుధ పోరాటంలో చనిపోయినవారిలో పార్టీలకు…
కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో డీజీపీతో మహేందర్‌రెడ్డితో కలిసి CS సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16, 17,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వక్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని CS అధికారులను ఆదేశించారు. భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రేపటి నుంచి (16)వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. Read also:National Integrations…
Telangana Government Will do Krishnam Raju Funeral Rites: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణం రాజు కన్నుమూశారు. ఆయన పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల పలువురు సినీ,…
Telangana Government Will do Krishnam Raju Funeral Rites: రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. యూసుఫ్‌గూడ లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియానికి కృష్ణంరాజు పార్దీవదేహాన్ని వుంచనున్నారు. అభిమానులు చూసేందుకు వీలుగా వుంటుందని ఈనిర్ణయం తీసుకున్నాట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో…
రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.