చైనా కమ్యూనిస్టు పార్టీ 20 మహాసభలు నేటితో ముగియనుండగా.. ఆ సమావేశాల్లో డ్రామా చోటుచేసుకుంది. అయిదేళ్లకు ఒకసారి జరిగే సీపీసీ సమావేశాలు గత ఆదివారం ప్రారంభం అయ్యాయి. కాగా నేడు చివరిరోజు కాగా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను సమావేశాల నుంచి బయటకు తీసుకెళ్లారు.
కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్బంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు కడతాం గోరీ అంటూ లంబాడి హ్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్న పోస్టర్లను నిన్న అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు.
గోషా మహల్ పోలీస్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమర వీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని పోలీస్ అమరవీరులకు రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, పలువురు సీనియర్ పోలీస్ ఉన్నత అధికారులు,
కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి 25 మంది మృతి చెందారు. చాలా మంది భూగర్భంలో చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు తర్వాత ఈసారి హైదరాబాద్లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో జడివాన నగర ప్రజలను వణికించింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.