Mobile Explode: కరోనా మహమ్మారి పుణ్యమాని పిల్లలకు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి విద్యాసంస్థలు.. దీంతో వాళ్లకు స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. క్లాసులు అయిన తర్వాత పిల్లలు అందులో గేమ్స్ ఆడుతూ వాటికి బానిసలవుతున్నారు. ఈ తరుణంలో కొన్ని చోట్ల సెల్ ఫోన్ పేలుడు ఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అలాంటి ఘటనే తాజాగా మరోచోట నమోదైంది. చిన్నారి ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా.. హఠాత్తుగా పేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మధురలోని మేవాటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే…మధురకు చెందిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కొడుకుకి మొబైల్ ఫోన్ ఇచ్చాడు.
Read Also: CM KCR Delhi Tour : రేపు ఢిల్లీకి కేసీఆర్.. 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
ఆ చిన్నారి తన ఆన్ లైన్ క్లాస్ అని చెప్పి తండ్రి నుంచి ఫోన్ తీసుకున్నాడు. క్లాస్ అయిన తర్వాత అందులో గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. ఉన్నట్లుంది బాలుడు వాడుతున్న ఫోన్ పేలిపోయింది. ఆ పేలుడు శబ్దానికి వేరే గదిలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఉలిక్కిపడి…హుటాహుటినా వచ్చి చూడగా…బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. గేమ్స్ ఆడుతుండగానే మొబైల్ పేలిందని, ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో జునైద్ తీవ్రంగా భయపడ్డాడని తెలిపాడు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, జునైద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారని చిన్నారి తండ్రి జావేద్ పేర్కొన్నాడు.