ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీష్ సిసోడియా కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాంగ్మూలం ఆదివారం సీబీఐ తీసుకోనుంది. ఈనెల 11న తాను అందుబాటులో ఉంటానంటూ కవిత ప్రకటించిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు ఆమె ఇంటికి నేడు ఉదయం 11గంటలకు రానున్నారు సీబీఐ అధికారులు. అయితే.. ఇప్పటికే సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ నోటీసులను కల్వకుంట్ల కవిత అందుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సీబీఐకి వివరణ ఇవ్వనున్నారు కవిత.
Also Read :Cyclone Mandous: తీవ్ర వాయుగుండంగా మారిన మాండూస్.. చెన్నైని వణికిస్తున్న వర్షాలు
ఇవాళ సీబీఐ రాకతో కవిత నివాసం వద్దకు నేతలు, కార్యకర్తలు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేసింది టీఆర్‌ఎస్. కవితకు నోటీసు రాజకీయ కుట్ర అని అంటున్న టీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపణలు చేసింది. అయితే.. సీబీఐ విచారణలో ఏం జరుగుతుందని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ చట్టపరంగా వ్యవహరిస్తే సహకరించాలని.. అలాలేని పక్షంలో న్యాయపోరాటం చేయాలని కవిత భావిస్తున్నారు. సీబీఐ నోటీసులపై ఇప్పటికే న్యాయ నిపుణులతో కల్వకుంట్ల కవిత చర్చించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే.. మెటీరియల్ ఎవిడెన్స్ లేదని ఆ ఇద్దరికీ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది.