మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకం ద్వారా 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ…
speaker pocharam srinivas reddy chaired the bac meeting: స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో.. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. బీఏసీ సమావేశానికి సీఎం హాజరుకాలేదు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్గ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ..భేటీలో ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈనేపథ్యంలో.. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతుందన్నారు. రాష్ట్ర సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978-1983, 1983-84 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని తెలిపారు. ఇక 1945…
Talasani Srinivas warangal tour: సామాజిక దృష్టి కోణంలో కుల వృత్తులను కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి జనగామ జిల్లా లోని స్టేషన్ ఘన్ పూర్ లో ప్రారంభించడం జరిగిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 26,778 నీటి…
Road Accident at Madapur: ప్రదం ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ప్రమాదాలు జరగకుండా అధికారలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. మద్యం మత్తులో కారు నడపకూడదని చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఈ తరహా ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కానీ.. దాని ద్వారా వారు జైలు పాలు అవుతారని మాత్రం మరుస్తున్నారు. మరి కొందరైనా అతి తెలివి ఉపయోగింది. ప్రమాదం చేసి ఏమీ ఎరగ నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రమాదాలు చేసి అందులో వారి ప్రమేమం…
కు.ని వికటించిన కేసులో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. 30 మంది మహిళలను హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈరోజు 11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నామని తెలిపారు. చికిత్స పొందుతున్న 18 మందిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. బాధిత మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆపరేషన్స్ చేసిన వైద్య సిబ్బందిని విచారణ చేశామని అన్నారు. వసతులు,…
Nirvair Singh: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ దుర్మణం పాలయ్యాడు. పంజాబీ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ అయిన నిర్వేయర్ సింగ్ ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్ళాడు.
త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ తో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలను మా ప్రభుత్వం కాపాడుకుంటుందని హరీష్ రావ్ అన్నారు. దేశంలో ఎక్కడ కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తలేరని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఉచితాలు బీజేపీ బంద్ చేయమంటుందని, ఏది ఉచితం ఏది అనుచితం…
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. విఘ్నేశ్వరుడి ప్రతిమ 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు సృష్టించింది. ఇక ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి.. ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని…
తిరుమలలో నేడు వరాహజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిచనున్నారు. నేడు వరాహ జయంతి సందర్భంగా.. ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం చేయనున్నారు.. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్నది.…