Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీల నియామకం కల్లోలం సృష్టిస్తున్నాయి. నిన్న ప్రకటించిన ఏఐసీసీ రిలీజ్ చేసిన జాబితాలో తన జూనియర్ల కంటే తక్కువ స్థానం కల్పించారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని ఆత్మాభిమానం కూడా ముఖ్యమంటూ తెలిపారు. పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడమంటే.. తనను అవమానించడమేనన్నారు. ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారుతోంది. తాను 34 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేస్తున్నామన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి మంత్రిగా పని చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు.
Read Also: Farmers Agitation : ఢిల్లీలో రోడ్డెక్కిన రైతులు.. హామీలను అమలు చేయాలని డిమాండ్
ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ కు తమ మద్దతు ఉంటుందని కొండా సురేఖ స్పష్టం చేసారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలను తక్కువ చేయటం బాధ కలిగిస్తుందన్నారు. తనకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో అవకాశం ఇచ్చినా లేకున్నా..తాను పట్టించుకోనని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని తేల్చి చెప్పారు. వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో కార్యకర్తలతో తాను కలిసే ఉంటానని కొండా సురేఖ వెల్లడించారు. తనకు పదవుల కంటే ఆత్మాభిమానం ముఖ్యమని కొండా సురేఖ లేఖలో తేల్చి చెప్పారు.